ఈ నెల 13న పుదుచ్చేరి సీఎంగా రంగసామి ప్రమాణం

  • లెఫ్టినెంట్ గవర్నర్‌ కే.కైలాసనాథ్‌ను కలిసిన ఎన్డీయే కూటమి పార్టీలు
  • తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేల జాబితాను అందజేసిన రంగసామి
  • అసెంబ్లీ ఎన్నికల్లో 18 స్థానాలు గెలుచుకున్న ఎన్డీయే కూటమి
ఏఐఎన్ఆర్‌సీ అధినేత ఎన్.రంగసామి ఈ నెల 13వ తేదీన పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రంగసామి ఈరోజు లెఫ్టినెంట్ గవర్నర్ కె. కైలాసనాథ్‌ను కలిసి తనకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన బలం ఉందని తెలిపారు. ఈ మేరకు తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేల జాబితాను అందజేశారు.

రంగసామి వెంట కూటమి పార్టీలకు చెందిన కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉన్నారు. రంగసామి సమర్పించిన లేఖను ఆమోదం కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించనున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

30 సీట్లున్న పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 18 స్థానాలను గెలుచుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు కేంద్రమంత్రి మాండవీయ, రంగసామి నేతృత్వంలో మిత్ర పక్ష నాయకులు, ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఎన్డీయే కూటమి నాయకుడిగా రంగసామిని ఎన్నుకున్నారు. కూటమిలోని పార్టీలు ఆయనకు మద్దతుగా లేఖలను అందజేశాయి.  అనంతరం లెఫ్టినెంట్ గవర్నర్ కైలాసనాథ్‌ను లోక్ నివాస్‌లో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కూటమి నేతలు కోరారు.

N Rangaswamy
Puducherry CM
Puducherry Chief Minister
Puducherry election
AINRC
NDA alliance

More Telugu News